Latest News

‘బాహుబలి’ వచ్చేసిందీ !
by MTW - 1

దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ నేడు విడుదల కానుందన్న విషయం తెలిసిందే. మొదట ఉదయం 10:30కు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ట్రైలర్‌ను వినూత్నంగా విడుదల చేశారు. ఇక ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో ‘బాహుబలి’ టీమ్ రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, బాహుబలి హిందీ పంపిణీదారుడు కరణ్ జోహర్‌లు ట్రైలర్‌ను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకు తెలుగు, హిందీ భాషల్లో ట్రైలర్‌ ఆన్‌లైన్లో విడుదల అయింది. ప్రభాస్, రానాల కళ్ళు తిప్పుకోనివ్వని లుక్స్, రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది. ఇక “నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి.. నేను ఎవర్ణి?” అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. రెండు నిమిషాల ట్రైలరే ఈ స్థాయి అనుభూతి కలిగిస్తే, ఇక పూర్తి సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందోనని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అంతా అనుకున్నట్టుగానే బాహుబలి ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి.


« PREV
NEXT »

1 comment