Latest News

సీరియస్‌గా స్పందించిన వర్మ
by MTW - 0

ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మపై సహజంగానే రకరకాల పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. తనపై వచ్చే చిన్న చిన్న పుకార్లను నవ్వుతూ కొట్టిపడేసే వర్మ, తాజాగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త చూసాక మాత్రం కొంచెం ఘాటూగానే స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ఓ పోర్న్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడన్నది ఆ వార్త సారాంశం.
ఓ ప్రముఖ శృంగార తారతో వర్మ పూర్తి స్థాయి శృంగార చిత్రాన్ని చేయనున్నాడని, ఇండియాలో ఆ సినిమాలకు అనుమతి లేనందున అమెరికాలోనే షూటింగ్‌తో పాటు రిలీజ్‌నూ ప్లాన్ చేస్తున్నాడని ఆ కథనం వివరించింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన వర్మ, “నేను ఒక అడల్ట్ సినిమా చేస్తున్నాన్నది నాన్సెన్స్ న్యూస్. ఒక జర్నలిస్ట్ ఇలాంటి వార్త రాసేముందు కనీసం చెక్ చేసుకోవాలి” అన్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘మొగలి పువ్వు’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘అటాక్’ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే!




« PREV
NEXT »

No comments

Post a Comment