Latest News

ఆటోజానీ టీంకు పెద్ద షాక్!
by MTW - 0

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ సినిమా లో న‌టించేందుకు న‌య‌న‌తార ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు ఎనిమిది సంవ‌త్స‌రాల త‌ర్వాత చిరు ముఖానికి రంగేసుకోనున్నారు. ఆటోజానీ పేరుతో తెర‌కెక్కే ఈ సినిమాలో న‌టించేందుకు చిత్ర‌యూనిట్ న‌య‌నతార‌ను సంప్ర‌దిస్తే అందుకు ఓకే చెప్పిన న‌య‌న రూ.3 కోట్లు అడ‌గ‌డంతో చిత్ర యూనిట్ అవాక్కైన‌ట్టు స‌మాచారం.
ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. మ‌రో హీరోయిన్‌గా తెలుగ‌మ్మాయి అంజ‌లి ఎంపికైంది. చిరు స‌ర‌స‌న న‌టించే ఆ ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతోందో చూడాలి. ఈ సినిమాను చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌తేజ్ నిర్మిస్తుండ‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిరు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment