Latest News

‘పాపనాశం’ రెడీ అవుతోంది!
by MTW - 0

కమల్‌హాసస్‌ హీరోగా నటించిన ‘ విశ్వరూపం2’ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంటే... ఆయన నటించిన మరో చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో అదే పేరుతో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ రీమేక్‌లో కమల్‌తో పాటు ఆయనతో సహజీవనం చేస్తోన్న గౌతమి నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి మలయాళం మాతృకకు దర్శకత్వం వహించిన జీతూజోసెఫ్‌ ఈ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అయితే తమిళంలో మాత్రం ఈ చిత్రానికి ‘దృశ్యం’ అనే టైటిల్‌ పెట్టకుండా ‘పాపనాశం’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి స్పందనను రాబడుతోంది. ఇక ‘దృశ్యం’ చిత్రంలో కరెప్టెడ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్ర ఎంతో కీలకమైంది. ఆ పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ పాత్రను ఇప్పుడు తమిళంలో కళాభవన్‌మణి చేస్తున్నాడు. ఈ చిత్రంలో నటించడం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆయన తమిళంలో నటిస్తున్న చిత్రం కాబట్టి ఆయన ఈ చిత్రాన్ని తన రీఎంట్రీ ఫిల్మ్‌గా భావిస్తున్నాడు. ఈ చిత్రంతో కళాభవన్‌మణి మరోసారి ఓ వెలుగు వెలగడం ఖాయమని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment