విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన
గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్. రీసెంట్ గా ఓకే బంగారం, గంగ
సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే నేటితరం హీరోయిన్లంతా
ఫిట్ నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. నాజుగ్గా ఉండడానికే
ఇష్టపడుతున్నారు. నిత్య మాత్రం అలాంటి ప్రయత్నాలకు చాలా దూరంగా ఉంటుంది.
బొద్దుగా ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంతే కాదు తన అంత అందంగా,
ముద్దుగా ఉండడానికి కారణాలు సైతం చెప్తుంది.
డాక్టర్స్ అంతా కొవ్వు పెరిగిపోతుందని ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోకూడదని
చెప్తుంటే నిత్య మాత్రం రోజు తీసుకునే ఫుడ్ లో నెయ్యి ని చేర్చమని
చెప్తుంది. తను గ్లామరస్ గా ఉండడానికి రీజన్ అదేనట. అంతేకాకుండా నెయ్యి
తీసుకుంటే ఆరోగ్యం కూడా అంటోంది. తను ఏ ఫుడ్ తీసుకున్న అందులో నెయ్యి
మాత్రం పక్కాగా ఉండాల్సిందేనట.
No comments
Post a Comment