Latest News

బాహుబలి ఫై డౌట్స్ తీర్చేసిన రాజమౌళి !
by MTW - 0

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. ఈ చిత్ర ఆడియో రిలీజ్ కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా మే 31న హైదరాబాద్ హైటెక్స్ లో పాటల విడుదల కార్యక్రమం గ్రాండ్ గా చేయాలనుకున్నారు. అయితే సెక్యూరిటీ సమస్యలతో పోలీసులు అనుమతి నిరాకరించడంతో బాహుబలి ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు, హీరో ప్రభాస్ మీడియాతో చెప్పారు. అయితే ఆడియో రిలీజ్ సడన్ గా వాయిదా పడడంపై చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి. వీటన్నిటికి రాజమౌళి సమాధానమిచ్చారు.
ఆయన మాట్లాడుతూ , ప్రభాస్ ను దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తెరమీదకు తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా జరగనున్న బాహుబలి ఆడియో లాంచ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పబ్లిసిటీ పరంగా పీక్స్ కి వెళ్లింది. అందుకే బాహుబలి ఆడియోను ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రాండ్ గా రిలీజ్ చేయాలన్నదే మా తపన. ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశముంది కాబట్టి ఇంత తక్కువ సమయంలో పోలీసులు సెక్యూరిటీ కల్పించలేమన్నారు. వారు చెప్పింది కరెక్టే అని టీం అంతా భావించాం. ప్రభాస్ దగ్గరికి ఫ్యాన్స్ రావడమా. లేక ఫ్యాన్స్ దగ్గరికి ప్రభాస్ వెళ్లడమా అనేది త్వరలోనే చెబుతాం. చాలా జిల్లాల నుంచి ఫోన్స్ చేస్తున్నారు. మా ఊర్లో ఆడియో రిలీజ్ చేయండని. మాకు సెక్యూరిటీ పరంగా ఎక్కడ సేఫ్ అనిపిస్తే అక్కడే ఆడియో లాంచ్ చేస్తాం. ఇక బాహుబలి ఫస్ట్ పార్ట్ టాకీ, రీ రికార్డింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ వర్క్ చివరి దశలో ఉంది. సినిమా నిడివి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు. ఇక బాహుబలి పార్ట్ 2 డెబ్బై శాంత పూర్తయింది. అని అన్నారు.




« PREV
NEXT »

No comments

Post a Comment