నందమూరి ఫ్యామిలీలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్త గత కొన్నాళ్ళ నుంచి హల్చల్ చేస్తూనే ఉంది. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్-బాలకృష్ణ ఇలా రకరకాల కాంబినేషన్లు తెరపైకి వచ్చినా ఏదీ ముందుకు కదిలినట్లు కనిపించలేదు. తాజాగా ఇందులో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్ కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారనున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నారట. వక్కంతం వంశీ చెప్పిన పవర్ఫుల్ కథ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరికీ నచ్చిందని, వారిద్దరూ వెంటనే సినిమాను ఓకే చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వక్కంతం వంశీ తాజాగా టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన విషయం తెలిసిందే! కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కిన కిక్ 2 ఈ నెల్లోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే! ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు తాము నటిస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా కోసం సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.
Tags: Nandamuri Brothers Multi Starrer Movie | Jr NTR - Kalyan Ram Multi Starrer Movie | Kalyan Ram - Jr NTR Multi Starrer Movie | Nanadamuri Brothers to Team up for a Multi Starrer Movie

must visit for all kind of movie may be you should try it bcoz quality nice putlockers ac
ReplyDelete