Latest News

పవన్‌, మహేష్‌ల స్థానాలు గల్లంతు!
by MTW - 0

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఇతర టాప్‌ సౌతిండియన్‌ స్టార్స్‌ విజయ్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబులను వెనక్కి తోసి సౌతిండియన్‌ అల్టిమేట్‌ స్టార్‌గా నిలిచాడు. ప్రముఖ బాలీవుడ్‌ వీడియో సంస్థ బాలీవుడ్‌ లైఫ్‌ నిర్వహించిన సర్వేలో అజిత్‌ టాప్‌ పొజిషన్‌ దక్కించుకున్నాడు. సౌతిండియన్‌ అల్టిమేట్‌ స్టార్‌ ఎవరు? అనే అంశంపై జరిగిన ఆన్‌లైన్‌ సర్వేలో అజిత్‌ 51.27% ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన తర్వాత39.69% ఓట్లతో విజయ్‌ రెండోస్థానంలో నిలిచాడు. అయితే సౌత్‌ఇండియాలో పాపులర్‌ అయిన తెలుగు స్టార్స్‌ పవన్‌కళ్యాణ్‌, మహేష్‌లకు ఆన్‌లైన్‌ సర్వేలో చాలా తక్కువ ఓట్లుపడ్డాయి. పవన్‌కి కేవలం 3.82% ఓట్లు రాగా, మహేష్‌బాబు 1.87%ఓట్లు దక్కించుకున్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment