కోలీవుడ్ టాప్ హీరో సూర్య - కమర్షియల్ సినిమాల దర్శకుడు వెంకట్‌ప్రభు కాంబినేషన్లో తమిళంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం మాస్ సినిమా తెలుగులో రాక్షసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు. దెయ్యం నేపథ్యంలో నడిచే నేచురల్ థ్రిల్లర్ మూవీ అయినా అన్ని వర్గాలతో పాటు పిల్లలను కూడా అమితంగా ఆకట్టుకుంటుందని చెపుతున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుండడంతో మంచి అంచనాలతో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రాక్షసుడు టాలీవుడ్లో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
No comments
Post a Comment