Latest News

రకుల్ ఏమంటుందో..?
by MTW - 0


టాలీవుడ్ లో ప్రజెంట్ డిమాండ్ ఉన్న కథానాయిక ఎవరంటే అది రకుల్ ప్రీత్ సింగే. వరుస అవకాశాలతో ఇప్పుడీ ఢిల్లీ బ్యూటీ వండర్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలు రవితేజ, రామ్ చరణ్ మూవీల్లో నటిస్తున్న ముద్దుగుమ్మ ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవంలోనూ ఆఫర్లు కొట్టేసి హాట్ టాపిక్ గా మారింది. ఇవిలా ఉండగానే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ మేటర్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది.

తాజాగా రకుల్ యంగ్ హీరో నితిన్ అప్ కమింగ్ మూవీలో నటించబోతోందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికే చేతినిండా సినిమాలతో రకుల్ బిజీగా ఉండటంతో ఆమె డేట్స్ ఇస్తుందో లేదో అని డౌట్ పడుతున్నారు.అయితే నితిన్ మాత్రం ఎలాగైనా ఆ ముద్దుగుమ్మనే సినిమాకు బుక్ చేయాలని పట్టుబడుతున్నాడట. కోటి రూపాయలు ఇచ్చి అయినా సరే ఒప్పించాలని దర్శకుడికి చెప్పాడట , దీంతో దర్శకుడు మల్లిడి వేణు రకుల్ కాక పట్టే పనిలో పడ్డాడని టాక్..!

ఏమైనా రకుల్ టైం ప్రస్తుతం బాగుంది.. మరి నితిన్ ఆఫర్ కి ఎంతవరకు టెంప్ట్ అవుతుందో చూడాలి..




« PREV
NEXT »

No comments

Post a Comment