యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తర్వాత ఆ స్థాయి హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. సింహ లాంటి బ్లాక్‌బస్టర్‌తో బాలయ్య కేరీర్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లిన బోయపాటికి బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చాడు. లెజెండ్‌తో మరోసారి సింహ సెంటిమెంట్‌ను బోయపాటి రిపీట్ చేశాడు.
సింహ, లెజెండ్ సినిమాలు సినిమాలు రెండు బాలయ్య కేరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్స్ అవ్వడంతో పాటు కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. లెజెండ్ ఇటీవలే 60 వారాలు పూర్తి చేసుకుని ఇంకా ఆడుతోంది. బాలయ్య తాజా సినిమా లయన్ తర్వాత తన 99వ సినిమా శ్రీవాస్ డైరెక్షన్లో చేయనున్నారు. డిక్టేటర్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే బాలయ్య కేరీర్‌కు ప్రతిష్ఠాత్మకమైన వందో సినిమాను డైరెక్ట్ చేసే గోల్డెన్ఛాన్స్ను బోయపాటి దక్కించుకున్నట్టు టాక్. బాలయ్య మంచి స్టోరీ రెఢీ చేయమని బోయపాటికి చెప్పేశాడని...ప్రస్తుతం బోయపాటి బాలయ్య వందో సినిమా కోసం కథను రెఢీ చేసేందుకు కుస్తీ పడుతున్నారట.
ప్రస్తుతం అల్లు అర్జున్ను డైరెక్ట్ చేస్తున్న బోయపాటి అది పూర్తయిన వెంటనే బాలయ్య వందో సినిమాపై కసరత్తులు చేయనున్నారు. ఏదేమైనా మరోసారి సింహ, లెజెండ్ కాంబినేషన్ రిపీట్ కావడంతో బాలయ్య వందో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
No comments
Post a Comment