మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజుకు రెండు రోజుల ముందే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్‌లుక్, టీజర్లను విడుదల చేస్తారని ఇంతకు ముందే తెలియజేశారు. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఫస్ట్‌లుక్ కూడా విడుదల కాలేదు. కనీసం సినిమా టైటిల్ కూడా కన్ఫర్మ్ కాలేదు. దీంతో ఈ పోస్టర్, టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ రోజే మహేష్ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కావడం విశేషంగా కనిపిస్తోంది. ‘శ్రీమంతుడు’ అని ఇప్పటివరకూ వినిపించిన పేరునే ఖరారు చేశారు. కథానుగుణంగానే శ్రీమంతుడు అనే సాఫ్ట్ టైటిల్ పెట్టాలనుకున్న విషయం తెలిసిందే! ఇక ఈ పోస్టర్ విడుదలైన అతి కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. మహేష్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోరుకుంటున్న అభిమానులకు ఈ సినిమా ఆ కోరికను నెరవేరుస్తుందని సినిమా యూనిట్ టాక్. అందుకు తగ్గట్టుగానే పోస్టర్లో ఆ ఫీల్ ఉండడం అభిమానులను ఆనందాల్లో ముంచెత్తింది.
No comments
Post a Comment