‘బాహుబలి’ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల కావడానికి ఇంకా ఒకరోజు ఉన్న విషయం తెలిసిందే! ఈలోగా బాహుబలి ట్రైలర్ ఏ రేంజ్లో ఉండనుందనేది తెలియజేయడానికి ఓ చిన్న సాంపిల్ నిన్న సాయంత్రం వదిలారు. ఏది చేసినా సరికొత్తగా ఉండాలనుకునే రాజమౌళి 20 సెకండ్ల నిడివి గల ‘బాహుబలి’ టీజర్‌ను నిన్న సాయంత్రం వినూత్నంగా విడుదల చేశారు. హీరోయిన్గా నటించిన అనుష్క ట్విట్టర్లో వీడియో చాట్ చేస్తూ ఈ టీజర్‌ను విడుదల చేయగా.. రాజమౌళి, రానా ఇద్దరు కలిసి టీవీ 5 స్టూడియోలో టీజర్‌ను విడుదల చేశారు.
ఈ 20 సెకండ్ల టీజర్ చూసిన వారెవ్వరైనా వారెవ్వా అనకుండా ఉండలేరు. కేవలం ఐదారు షాట్స్ చూస్తేనే ఈ స్థాయి అనుభూతి కలిగితే ఇక సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందోనని అభిమానులు సోషల్ మీడియోలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. విడుదలైన 12 గంటల్లోనే 4 లక్షల పైచిలుకు వ్యూస్‌తో ఈ టీజర్ దూసుకుపోతోందంటే ‘బాహుబలి’ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిపోతుంది. బీభత్సకరంగా ఉన్న రానాను, రౌద్రరసం నిండిన ప్రభాస్ కళ్ళను ఈ టీజర్లో చూడొచ్చు. ఇక జూన్ 1న ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పుడు బాహుబలి అభిమానుల కళ్ళన్నీ ఆ ట్రైలర్‌పైనే.
No comments
Post a Comment