Latest News

సమంతా...ఇది సమంజసమా!
by MTW - 0

తెలుగులో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఏ మాయ చేశావే’తో తెలుగు తెరకు పరిచయం అయి, తెలుగులో ఆ తర్వాత టాప్‌ పొజిషన్‌కు చేరుకున్న హీరోయిన్‌ సమంత. ఆమెకు గౌతమ్‌మీనన్‌ లేనిదే ఇంత ఇమేజ్‌ వచ్చి ఉండేది కాదు అన్నది అక్షరసత్యం. ఆ తర్వాత ఆమె కోలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో కూడా ఆమెకు గౌతమ్‌మీనన్‌ బ్రాండ్‌నేమ్‌ ఎంతో ఉపయోగపడిరది.  ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌.. శింబు హీరోగా ఓ చిత్రం ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ టాప్‌ హీరోయిన్‌ని పెట్టుకోవాలని భావించిన గౌతమ్‌మీనన్‌ ఆ పాత్ర చేయమని సమంతను కోరాడట. అయితే తాను బిజీగా ఉన్నానని, తన డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కూడా కుదరదని ఖరాఖండీగా తన గురువుకే తేల్చిచెప్పడంతో ఇప్పుడు అందరూ హవ్వా... సమంత అని అనుకొంటున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment