Latest News

బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ డీటైల్స్
by MTW - 0


దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు లీక్ అయ్యింది. ఈ సినిమా జూలై 10న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. 
ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండడ్స్‌లో రూపొందిస్తున్న రాజమౌళి ఇంటర్నేషనల్‌గా కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ పార్ట్ -1 తెలుగు/తమిళ్/హిందీ వెర్షన్లలో 2.30 గంటల నిడివి ఉంటే ఇంటర్నేషనల్ వెర్షన్‌లో 1.30 గంటలు మాత్రమే ఉంటోందని సమాచారం. 
సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్‌ను ఇంటర్నేషనల్ వెర్షన్‌లో పూర్తిగా కట్ చేయనున్నారట. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలిని ప్రదర్శించేందుకు రాజమౌళి టీం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా చైనా, జపనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment