Latest News

‘బాహుబలి’ రుణం తీర్చుకునే సమయం!
by MTW - 0

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ చిత్రం తమిళ హక్కులను జ్ఞానవేల్‌రాజా భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు రాజమౌళి, ప్రభాస్‌లతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు జ్ఞానవేల్‌రాజా తమిళంలో సూర్య హీరోగా ‘మాస్‌’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఒకేరోజున విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ను పెట్టారు. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ఆడియో వేడుక ఈనెల 18న హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరుగనుంది. ‘బాహుబలి’ హక్కుల నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో వేడుకకు రాజమౌళితో పాటు ప్రభాస్‌ కూడా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment