Latest News

నిర్మాతగా అవతారం ఎత్తుతోన్న మహేష్‌!
by MTW - 0

హీరోలకు సొంత బేనర్‌లు ఉండటం కొత్తేమీ కాదు. ఎందుకంటే ఎప్పుడే అవసరం వస్తుందో... మనకు నచ్చిన సబ్జెక్ట్‌ కొద్దిగా రిస్క్‌ అనిపించినప్పుడు వేరే నిర్మాతలపై రుద్దే బదులు సొంతంగా తీసుకొని కష్టనష్టాలను పడొచ్చు. అలాగే మన టేస్ట్‌కు తగిన చిత్రాన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా మన క్రేజ్‌ని మనమే బిజినెస్‌ చేసుకోవచ్చు. ఫైనల్‌గా నిర్మాతలు ఎవ్వరూ మన మీద తగినంత పెట్టడానికి ధైర్యం చేయలేని ఫ్లాపుల దశలో మనమే ఓ హిట్‌ సినిమా తీసుకొని చెలరేగిపోవచ్చు. ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టే మన హీరోలు తమ సొంతబేనర్లను పెట్టుకొని కెరీర్‌ని కొనసాగిస్తుంటారు. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తను సొంతంగా ఇప్పటివరకు ఓ బేనర్‌ పెట్టలేదు. తన తండ్రి బేనర్‌ పద్మాలయా ఫిలింస్‌తో పాటు తన సోదరి మంజుల బేనర్‌లో, ఇంకా కాకపోతే తన సోదరుడు రమేష్‌బాబు బేనర్‌లోనో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వాటినే తన సొంత బేనర్లుగా భావిస్తూ వస్తున్నాడు. అయితే పిల్లలు పెద్దవాళ్లు అవుతుండటం, తన భార్య నమ్రతకు బిజినెస్‌లో కూడా వ్యాపకం ఉంటాయని భావిస్తున్నాడు. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకొని మహేష్‌, నమ్రతలు ఓ బేనర్‌కు శ్రీకారం చుడుతున్నారు. 
      తమ కుమారుడైన గౌతమ్‌ పేరుపై ‘గౌతమ్‌ ప్రొడక్షన్స్‌’ అనే స్థాపించి  తన తండ్రి కృష్ణ జన్మదినమైన మే 31న ఈ బేనర్‌ను ప్రారంభించనున్నాడని సమాచారం. ప్రయోగాత్మక చిత్రాలు, నావల్‌ ఐడియా ఉన్న చిత్రాలను నిర్మించడంతో పాటు కేవలం తను హీరోగా నటిస్తున్న చిత్రాలనే కాకుండా కొత్త, యువతరం హీరోలతో కూడా లోబడ్జెట్‌ చిత్రాలు తీయనున్నాడట. ఇది ఆయన బావ సుధీర్‌బాబుకు బాగా కలిసొచ్చే అవకాశం అంటున్నారు. అలాగే రాబోయే రోజుల్లో పవన్‌ స్వంత నిర్మాణ సంస్థ పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకం ద్వారా పవన్‌ టేస్ట్‌, గౌతమ్‌ప్రొడక్షన్స్‌ ద్వారా మహేష్‌ టేస్ట్‌లను బేరీజు వేసే అవకాశం రానుంది. 

« PREV
NEXT »

No comments

Post a Comment