Latest News

యాంకర్ గా మారబోతున్న ఈగ!
by MTW - 0

యువ క‌థానాయ‌కుడు నాని యాంక‌ర్‌గా మార‌బోతున్నాడు. ఆశ్చ‌ర్యంగా ఉందా? యాంక‌రింగ్ నుంచి క‌థానాయ‌కులైన‌వాళ్ల‌ను చూశాం, కానీ క‌థానాయ‌కుడు యాంక‌ర్‌గా  మార‌డమేంటి అంటారా? అదే మ‌రి ఇక్క‌డ ట్విస్టు. నాని యాంక‌ర్‌గా మారుతుంది త‌న‌కు `ఈగ‌`లాంటి ఒక మంచి హిట్టిచ్చిన రాజ‌మౌళి కోసం. అవును... రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి` చిత్రానికి సంబంధించిన పాట‌లు ఈ నెల 31న హైద‌రాబాద్‌లో విడుద‌ల కాబోతున్నాయి. అదే వేడుక‌లో ట్ర‌యిల‌ర్‌ని కూడా విడుద‌ల చేస్తారు. గ్రాండ్ మేన‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఆ వేడుక‌కి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని రాజ‌మౌళి నానిని అడిగార‌ట‌. అంత‌కంటే భాగ్య‌మా  అన్న‌ట్టుగా నాని వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. మా ఈగ యాంక‌రింగ్‌కి ఒప్పుకొన్నందుకు కృతజ్జ‌త‌లు అని చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి. మంచి హాస్య‌చ‌తుర‌త ఉన్న నాని యాంక‌ర్‌గా వేడుక‌ని ర‌క్తి క‌ట్టిస్తాన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.




« PREV
NEXT »

No comments

Post a Comment