Latest News

అవ్వన్నీ పుకార్లేనంటోన్న అంజలి!
by MTW - 0

తెలుగమ్మాయి అంజలి అప్పట్లో ఎవరికీ కనిపించకుండా పోయి అందరినీ కంగారుపెట్టింది. ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. తాజాగా ఆమె మళ్లీ అదృశ్యం అయిందంటూ ఈమద్యకాలంలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు.. అంజలికి పెళ్లయిందని, పిల్లలు కూడా పుట్టారంటూ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై అంజలి స్పందిస్తూ నేను ఎక్కడికీ వెళ్లలేదు, అదంతా అవాస్తవం. పెళ్లి విషయం మీకు చెప్పకుండా నేను చేసుకోను. అందరికీ చెప్పే చేసుకుంటా. నా మేనల్లుడితో ఉన్న ఫొటో చూసి నాకు పిల్లలు పుట్టారంటూ ప్రచారం చేశారు. నాకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నాను,.. అని ఆమె స్పష్టం చేసింది. అలాగే చిరంజీవి 150వ చిత్రంలో ఆమె నటించనుందనే వార్తలను ఆమె ఖండించింది.

« PREV
NEXT »

No comments

Post a Comment