Latest News

సరికొత్త పాత్రలో తాప్సీ
by MTW - 0

గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతున్న తాప్సీ, ఆ పాత్రలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. ఈ కోవలో ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘కాంచన 2′ తర్వాత తాప్సీ పేరు తెలుగు, తమిళ భాషల్లో మారుమోగిపోయింది.
ప్రస్తుతం తాప్సీ, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కొంత గ్యాప్ తీసుకొని తెరకెక్కుస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! శింబు, కాథరిన్ థెరిసా, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో తాప్సీ ఓ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన పాత్రను ఎంచుకుంటూ తన కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటోంది తాప్సీ.


« PREV
NEXT »

No comments

Post a Comment