ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్ అనేది అన్ని
సినిమాలకు ఓ వరంగా తయారైంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు, స్టార్‌హీరోల
చిత్రాలకు అక్కడ తిరుగుండటం లేదు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబుతో పాటు చాలా
మంది స్టార్స్‌కు అక్కడ ఎనలేని క్రేజ్ ఉంది. దాంతో సినిమా ఓపెనింగ్‌కు
ముందే ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీ మొదలైపోతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్
సినిమాకి అదే జరుగుతోంది. రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ
చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో కోనవెంకట్,
గోపీమోహన్‌లు పనిచేయడం మొదలుపెట్టగానే ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.
కనీసం 20శాతం షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఓవర్సీస్ కోసం పోటీ
మొదలైపోయింది. ఓవర్సీస్ రైట్స్ ఇస్తామంటే సింగిల్ పేమెంట్‌లో 6కోట్లు
ఇస్తామని ఓ సంస్థ ముందుకొచ్చింది. చరణ్‌కు ఓవర్సీస్లో పెద్దగా క్రేజ్
లేదనేది వాస్తవం. ఇదంతా చరణ్ మహిమ కాదని, ఈ క్రెడిట్ శ్రీనువైట్లకు,
కోనవెంకట్, గోపీమోహన్‌లకు దక్కుతుందని కొందరు వాదిస్తుంటే కొందరు మాత్రం
చరణ్‌కు ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత వచ్చిన ఫ్యామిలీ ఇమేజ్
వల్లే సాధ్యమైందని అంటున్నారు. వాస్తవానికి ఓవర్సీస్లో శ్రీనువైట్ల
సినిమాలు బాగా వసూలు చేస్తుంటాయి. ముఖ్యంగా ‘దూకుడు’ చిత్రం తర్వాత అక్కడ
శ్రీనువైట్ల ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అదే చరణ్ సినిమాకు వరంగా మారిందని
అంటున్నారు.
No comments
Post a Comment