ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ వెండితెర డెబ్యూ మూవీ ఆంధ్రాపోరి సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు రుషి ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు.
ఆకాష్ సరసన హీరోయిన్గా ఉల్కాగుప్తా నటించింది. మరాఠాలో సూపర్‌హిట్ అయిన టైమ్‌పాస్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సెన్సార్ టీం క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా చాలా బాగుందని మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని చిత్రయూనిట్ సభ్యులు చెపుతున్నారు.
పూరి కూడా ఆంధ్రాపోరి తప్పకుండా హిట్ అవుతుందని , తన కుమారుడికి మంచి బ్రేక్ ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ సినిమాను జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
No comments
Post a Comment