కోలీవుడ్‌లో వరుస పెట్టి బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తు దూసుకుపోతున్నాడు హీరో అజిత్. ఆయన నటించిన ఎన్నై అరిందాల్ (తెలుగులో ఎంతవాడు గాని) సూపర్ హిట్ అయ్యింది. ఆయన నెక్ట్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వీరం (తెలుగులో వీరుడొక్కడే) ఫేం శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది.
అగ్ర నిర్మాత ఏఎం.రత్నం ఈ సినిమాకు నిర్మాత. తన సినిమాల షూటింగ్స్ టైంలో తానే స్వయంగా తయారు చేసిన రుచులు చిత్ర యూనిట్‌కు రుచి చూపించడం హీరో అజిత్‌కు అలవాటు. ఈ తాజా సినిమా షూటింగ్లో అజిత్ తయారు చేసిన బిర్యానీ రుచి చూసి శృతి అజిత్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషని..అలాగే ఆయనలో మంచి చెఫ్ కూడా దాగి ఉన్నాడని ప్రశంసించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అక్కౌంట్లో పోస్ట్ చేసింది.
ఇక అజిత్‌తో నటించడం తనకు మంచి అనుభవమని చెప్పింది. ఈ సినిమాలో అజిత్‌కు చెల్లిగా లక్ష్మీమీనన్ నటిస్తోంది.
No comments
Post a Comment