మహేష్‌బాబు నెక్స్ట్ ఫిల్మ్ సినిమా టైటిల్ మీద
మళ్లీ చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు
మొదటినుంచి కూడా 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ
టైటిల్‌ను కాదని 'మగాడు' అనే టైటిల్‌వైపు ఈ సినిమా యూనిట్
మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మహేష్, కొరటాల శివ సినిమా ప్రారంభమైనప్పటినుంచి కూడా
'శ్రీమంతుడు' అనే టైటిలే ప్రచారంలో ఉంది. సినీ జనాలు కూడా ఈ సినిమా పేరు
'శ్రీమంతుడు' అనే పేరుకే ఫిక్స్ అయిపోయారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఈ
సినిమా పేరు 'మగాడు'గా ఎందుకు మార్పుతున్నారనేది అర్థంకాకుండా ఉంది.
మహేష్‌బాబు సినిమాలకు త్రీ లెటర్స్ సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే.
మురారి, పోకిరి, ఒక్కడు, ఆగడు.. ఇలా మూడు అక్షరాల టైటిల్స్‌కే ఆయన అధిక
ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఇదే కోణంలో తన రాబోయే సినిమా పేరును కూడా 'మగాడు'గా
మహేష్‌బాబే మార్చి ఉంటారని సినీ జనాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక
యాక్షన్, సెంటిమెంట్ల కలయికతో రూపొందుతున్న ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల
ముందుకు రానుంది.
No comments
Post a Comment