విశ్వనాయకుడు కమల్‌హాసన్ నటించిన
ఉత్తమవిలన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన నటించిన విశ్వరూపం-2,
పాపనాశం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆయన నటించే మరో సినిమా
త్వరలోనే పట్టాలెక్కనుంది.
తూంగ వనం అనే
టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కమల్‌కు భార్యగా అలనాటి అందాల నటి
మనీషా కోయిరాలా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది.
జేమ్స్‌బాండ్ కథా చిత్రాల స్టైల్లో ఈ మూవీ ఉంటుందుందని సమాచారం.
మనీషా-కమల్
కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు ఎలాంటి హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు
అదే కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీట్ అవుతోంది. ఈ సినిమాలో
త్రిష, అనైకసోటి కూడా కమల్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి
పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
No comments
Post a Comment