కోలీవుడ్ యంగ్ హీరో శింబు మరోసారి లవ్లో పడ్డారు. ఈ సారి ఈ కుర్ర హీరో ఏకంగా ఓ పోలీస్ అధికారిణినే బుట్టలో వేసుకున్నాడు. ఇప్పటికే నయనతార, హన్సికతో ప్రేమాయణం నడిపిన శింబు ఇప్పుడు పోలీస్ అధికారిణి లైన్లో పెట్టడం ఏంటనుకుంటున్నారా , ఈ సారి మాత్రం ఇది రియల్ లైఫ్లో కాదు రీల్ లైఫ్లో. శింబు నటించిన సినిమా రిలీజ్ అయ్యి మూడు సంవత్సరాలవుతోంది. ప్రస్తుతం శింబు సెల్వరాఘవన్ డైరెక్షన్లో కాన్ సినిమాలో నటిస్తున్నారు.
ఇటీవల ప్రేక్షకులను గంగగా మెప్పించిన తాప్సీ ఓ మహిళా పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. శింబు అయ్యప్పమాలాధారుడిగా నటిస్తున్నారు. శింబు తాప్సీతో వేసే చిలిపి వేషాలు ఓ రేంజ్లో ఉంటాయని కోలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
కేథరిన్ థెస్రా మరో హీరోయిన్గా నటిస్తోంది. కాన్ అంటే తమిళంలో అడవి అని అర్థం. ఈ సినిమాలో ముఖ్యమైన సీన్లన్నింటిని అడవిలో ఉన్న స్టేషన్లలోనే చిత్రీకరించారట. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
No comments
Post a Comment