ఛార్మి బోల్డ్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సరైన అవకాశం ఇవ్వాలి కానీ... ఆమె ఎలాంటి సాహసాలకైనా సై అంటుంది. ఆమధ్య
‘ప్రేమ ఒక మైకం’ అనే సినిమాలో కాల్‌గాళ్‌గా కనిపించింది. మరోసారి ఆమె
సెక్స్‌వర్కర్ పాత్రలో సందడి చేయబోతోందని ‘జ్యోతిలక్ష్మి’ టీజర్ చూస్తే
స్పష్టంగా అర్థమవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే
నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఛార్మి పుట్టినరోజును
పురస్కరించుకొని ట్రయిలర్‌ని విడుదల చేశారు. అందులో సంచలనం రేకెత్తించే
అంశాలున్నాయి.
ఒక సన్నివేశంలో ఛార్మి టాప్‌లెస్‌తో కనిపించింది. ఒంటి పైభాగంలో ఏమీ
లేకుండా హీరోని హత్తుకొంది. ఆ సన్నివేశం కుర్రకారుని ప్రత్యేకంగా
ఆకర్షిస్తోంది. బోల్డ్ ఛార్మికి ఈసారి బోల్డ్ పూరి తోడయ్యాడు కాబట్టి
సినిమాలో ఆ సన్నివేశం మరెంతగా రక్తికట్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు
ఉవ్విళ్లూరుతున్నారు. ఛార్మి టాప్ లేపేయడమే కాదు... ఆమెని ఒక హీరో
రేంజ్లోనూ చూపించినట్టున్నాడు పూరి. మొత్తమ్మీద ఛార్మి కెరీర్లో
‘జ్యోతిలక్ష్మి’ ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
No comments
Post a Comment