Latest News

యంగ్ హీరోతో నారా రోహిత్ ఢీ !
by MTW - 0

యంగ్ హీరో నాగశౌర్య తొలిసారిగా మాస్ క్యారెక్టర్‌లో నటించిన సినిమా జాదూగాడు. ఈ చిత్రాన్ని తొలుత జూన్ 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజు నాగశౌర్య జాదూగాడు సినిమాకు నారా రోహిత్ అసుర సినిమా నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. వాస్తవానికి అసురను ఈ నెల 29నే రిలీజ్ చేయాలని అనుకున్నా అదే రోజు రామ్ పండగచేస్కోతో పాటు సూర్య రాక్షసుడు సినిమాలు ఉండడంతో అసురను జూన్ 5కు వాయిదా వేశారు.
దీంతో సోలోగా ప్రేక్షకుల ముందుకు వద్దామనుకున్న నాగశౌర్యకు నారా రోహిత్ మూవీ నుంచి పోటీ గట్టిగానే ఉంది. అదే రోజు సంపూర్ణేష్‌బాబు నటించిన సింగం 123 కూడా రిలీజ్ కానుండడంతో ఈ ముగ్గురు యంగ్ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీపడుతున్నారు. వీరిలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో తెలియాలంటే జూన్ 5 వరకు ఆగాల్సిందే.




« PREV
NEXT »

No comments

Post a Comment