బాహుబలి ది బిగింనింగ్ పోస్టర్ల పరంపరలో భాగంగా వరుసపెట్టి నటీనటుల స్టిల్స్‌ను రిలీజ్ చేస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తాజాగా సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న ప్రభాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
యుద్ధ రంగంలో దుమికి వచ్చిన బాహుబలి ఒక చేత్తో కత్తి, మరో చేత్తో గొడ్డలి పట్టుకుని శత్రువులను చీల్చి చెండాడుతున్న స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఈ స్టిల్ చూస్తుంటే బాహుబలి యుద్ధరంగంలో ఏ రేంజ్లో తన విన్యాసాలు చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు.
ఈ పోస్టర్ రిలీజ్ చేసిన రాజమౌళి స్పందిస్తు సాహసవిక్రమ ధిశాలి ఇతను. రణతంత్రంలో ఆరితేరిన ఓ అలుపెరగని సైనికుడు. ఓ నిజమైన రారాజు. బాహుబలి అనే పౌరాణిక గాథే అతడి స్టోరీ అని పోస్ట్ చేశాడు.
ఈ పోస్టర్‌తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో అంచనాలకు అందడం లేదు. ఈ నెల 31న ఆడియోతో పాటు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.
ఈ పోస్టర్‌తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో అంచనాలకు అందడం లేదు. ఈ నెల 31న ఆడియోతో పాటు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.
No comments
Post a Comment