Latest News

‘కోబలి’ చిత్రానికి నిర్మాతగా ప్రిన్స్!
by MTW - 0

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు. వీరిద్దరికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ వీరిద్దరికి ఇంకొంచెం ఇమేజ్ ను జతచేసిన ఘనత మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దేనని చెప్పుకోవచ్చు. అతడు చిత్రం ద్వారా మహేష్ లో ఉన్న ఖలేజా ను బయటకు తీస్తే, అత్తారింటికి దారేది చిత్రం ద్వారా పవన్ ను ఎవరు అందుకోలేని స్దాయికి తీసుకువెళ్ళాడు. ఇదిలా ఉంటే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కోబలి చిత్రం తప్పకుండా చేస్తామని పవన్, త్రివిక్రమ్ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని పవన్ తన సొంత బ్యానర్ పైనే నిర్మించనున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. కాగా శ్రీమంతుడు చిత్రం ద్వారా ప్రిన్స్ మహేష్ నిర్మాత అవతారం ఎత్తారు. తన తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకొని మహేష్ తన కుమారుడు గౌతమ్ పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న కోబలి చిత్రానికి మహేష్ సహనిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. చిత్ర పరిశ్రమలో పీక్స్ లో ఉన్న వీరి ముగ్గురి కాంబినేషన్ లో చిత్రం వస్తే మాత్రం అది నిజంగా అభిమానులకు పండగే.

« PREV
NEXT »

No comments

Post a Comment