Latest News

విడుదల కాని ఉత్తమ విలన్, గంగ
by MTW - 0

సినిమా లవర్స్ కు బ్యాడ్ న్యూస్. ఎంతో ఆతృతగా ఎదురుచూసిన కమల్ హాసన్ ఉత్తమ విలన్, లారెన్స్ గంగ చిత్రాల మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేశారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మధ్యాహ్నానికి అన్నీ క్లియర్ చేసుకొని రిలీజ్ చేసే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో చర్చిస్తున్నారు.
ఇదిలా ఉంటే మే ఒకటిన రిలీజ్ చేస్తున్నామని చెప్పిన మంచు లక్ష్మి దొంగాట నిన్నటివరకు సైలెంట్ గా ఉండిపోయింది. ఆల్రెడీ తమిళ్ లో హిట్టయిన గంగ, నట కమలం ఉత్తమ విలన్ సినిమాల మధ్యలో దొంగాట రిలీజ్ ఎందుకులే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉత్తమ విలన్, గంగ సినిమాల రిలీజ్ లో తేడా రావడంతో దొంగాట టీంలో ఉత్సాహం మొదలైంది. ఎలాగైనా ఈరోజు దొంగాట రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు. మోహన్ బాబు రంగంలోకి దిగి దొంగాట రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఏది ఏమైనా సినిమా లవర్స్ కు శుక్రవారం బ్యాడ్ డేగా మిగిలిపోతుందా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అన్నీ క్లియరై గంగ వస్తుందా... గుడ్డిలో మెల్ల దొంగాట అయినా వస్తుందా అనే చర్చ జరుగుతోంది.




« PREV
NEXT »