Latest News

‘గబ్బర్ సింగ్ 2′ మొదలైంది
by MTW - 0

పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకిది శుభవార్త. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ నటించనున్న ఫుల్ లెంగ్త్ సినిమా ‘గబ్బర్ సింగ్ 2′ అన్న విషయం తెలిసిందే! ఈ సినిమా షూటింగ్ ఈరోజు, ఆరోజు అంటూ వాయిదా పడుతూ వచ్చి చివరకు నేటినుంచి సెట్స్‌పైకి వెళ్ళింది. పూణేలోని ఓ చిన్న గ్రామంలో ఈ సినిమా షూటింగ్ ఈరోజే ప్రారంభమైంది.
‘పవర్’ సినిమా ద్వారా హిట్‌ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇక నేడు షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా బాబీ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “ఈరోజు కోసం నేను కూడా ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. గబ్బర్ సింగ్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. పవన్ అభిమానులందరికీ థ్యాంక్స్” అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment