మెగాస్టార్ చిరంజీవి 150వ
సినిమా గురించి ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాకే ఓకే
చేస్తున్నారు. కథ కోసమే దాదాపు సంవత్సర కాలంగా వెయిట్ చేసిన చిరు తనతో పాటు
నటించే నటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపికలో చాలా జాగ్రత్తలు
తీసుకుంటున్నారు.
ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్గా రకరకాల పేర్లు వచ్చాయి. నయనతార, శ్రీదేవి, అనుష్క ఇలా పలు పేర్లు వినిపించినా నయనతార ఫైనలైజ్ అయినట్టు ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం చిరు సినిమాలో నయనతార హీరోయిన్గా చేయడం లేదని పూరి సన్నిహితులు చెప్పారు. ఇప్పటికే హీరోయిన్గా పూరి మదిలో ఓ స్టార్ హీరోయిన్ ఉన్నారని వారు చెపుతున్నారు. ఆమెతో పాటు మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న స్టార్ట్ అయ్యే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా జరగనుంది. నయనతార చిరు సినిమాలో హీరోయిన్ కాదని తెలియడంతో ఇప్పుడు చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
No comments
Post a Comment