Latest News

మే 14న విడుదలవుతున్న బాలకృష్ణ ‘లయన్’
by MTW - 0

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘లయన్’. జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు ఈ చిత్రాన్ని నిర్మించారు తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతోండగా.. ‘లెజెండ్‌’ అనంతరం రాధికా ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ గెటప్, డైలాగ్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది. . అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మే 14, గురువారం ఉదయం 9గంటల 36నిమిషాలకు విడుదల కానుంది. 
ఈ సందర్భంగా... 
చిత్రనిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ ‘‘లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణగారు చేస్తున్న చిత్రమే మా లయన్. బాలకృష్ణగారి నటవిశ్వరూపాన్ని మరోసారి చాటి చెప్పే చిత్రమవుతుంది. బాలయ్య ఇమేజ్ కి తగిన విధంగా సత్యదేవ అద్భుతమైన కథను తెరెకెక్కించారు. నందమూరి అభిమానులు బాలకృష్ణగారిని ఎలా చూడాలనుకుంటారో అలా ఉండే సినిమా. షడ్రషోపేతమైన మూవీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కి, మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. మణిశర్మగారు ఈ సినిమా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. లయన్ ఆడియో వేడుకలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ మంచి స్పందన వచ్చింది. సినిమాలో డైలాగ్స్ ను ఎప్పుడెప్పుడు థియటర్ విందామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారనే సంగతి మాకు తెలుసు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే 14, గురువారం ఉదయం 9గంటల 36 నిమిషాలకు విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరినీ అలరించే చిత్రమవుతుంది’’అన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment