ఇంతకాలం చిరంజీవి తనయుడి స్టార్‌డమ్‌ని
క్వశ్చన్ చేయాల్సిన అవసరం పడలేదు. కన్సిస్టెంట్గా హిట్ సినిమాలు చేస్తూ
అభిమానుల్ని అలరిస్తున్నాడు. అయితే మగధీర మినహా చరణ్ సినిమాలేవీ యాభై
కోట్ల మార్కు దాటలేదు. సగటు కమర్షియల్ ఎంటర్టైనర్స్తో చరణ్ కొన్ని
ఏరియాల్లో గెలవలేకపోతున్నాడు. చరణ్ వీకెస్ట్ ఏరియాగా ఓవర్సీస్ని
చెప్పుకోవాలి. ఇక్కడ స్టార్ హీరోలందరూ సత్తా చాటుకుంటూ ఉంటే చరణ్ తన
హిట్ చిత్రాలతో కూడా వసూళ్లు రాబట్టలేకపోతున్నాడు. ఇంతవరకు మిలియన్
డాలర్లు వసూలు చేసిన సినిమా తనకి ఒక్కటీ లేదు. రేసుగుర్రం తర్వాత సన్నాఫ్
సత్యమూర్తితో అల్లు అర్జున్‌కి ఇప్పుడు వరుసగా రెండు మిలియన్ డాలర్ల
సినిమాలున్నాయి.
చరణ్ రేంజ్ ఇక్కడ పెరుగుతుందీ అని ఎదురు
చూసిన ప్రతిసారీ డిజప్పాయింట్ చేస్తున్నాడు. మహేష్ సినిమాలకి పోటీగా తన
సినిమాలు రావడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే అల్లు అర్జున్‌కి పెరుగుతున్న
రేంజ్ చరణ్‌పై ప్రెజర్ పెంచుతోంది. చిరు, పవన్ తర్వాత ఈ జనరేషన్లో
మెగా ఫ్యామిలీ నుంచి టాప్ హీరోగా చరణ్‌కి తిరుగు లేదని అనుకుంటూ ఉంటే
అల్లు అర్జున్ ఆ పొజిషన్ని సవాల్ చేస్తున్నాడు. యుఎస్‌లో మూడు మిలియన్
డాలర్ల సినిమాలున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో చరణ్ తన
వీక్నెస్ని కవర్ చేసుకుంటాడా లేదా అనేదే ఇప్పుడు మెగా ఫాన్స్‌ని
ఉత్కంఠకి గురి చేస్తోంది.
No comments
Post a Comment