Latest News

కాయ్‌ రాజా కాయ్‌ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది - హీరో మానస్‌
by MTW - 0

చిన్న వయసులోనే ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా దాదాపు 10కి పైగా చిత్రాల్లో నటించి బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుని సొంతం చేసుకున్న మానస్‌ ఇప్పుడు హీరోగా నటిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ‘రaలక్‌, గ్రీన్‌సిగ్నల్‌, నూతిలో కప్పలు’ చిత్రాల్లో యువహీరోగా నటించి ప్రేక్షకుల మనసుల్లో లవర్‌బోయ్‌గా ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో నటిస్తున్న చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’. మారుతి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన శివగణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మారుతి టాకీస్‌ బ్యానర్‌లో ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.సతీష్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 23న విడుదలవుతోన్న సందర్భంగా యువ హీరో మానస్‌ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు.
 లవర్‌బోయ్‌గా మంచి పేరొచ్చింది...
చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. మెగాస్టార్‌ చిరంజీవి గారి డ్యాన్స్‌ చూసి ఇన్‌స్పైర్‌ అయ్యేవాడిని. ఆ ఇన్‌స్పిరేషనే నన్ను నటుడిని చేసింది. కమల్‌హాసన్‌, పవన్‌కళ్యాణ్‌, రవితేజ, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లను ఆదర్శంగా తీసుకుంటున్నాను. ‘రaలక్‌, గ్రీన్‌ సిగ్నల్‌, నూతిలో కప్పలు’ చిత్రాల్లో నటించిన నాకు లవర్‌బోయ్‌గా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రంలో మెయిన్‌ లీడ్‌ పాత్రను చేసాను. నాతోపాటు ఇంకో మెయిన్‌లీడ్‌ పాత్రలో రామ్‌ ఖన్నా నటించాడు. ఈ చిత్రం ద్వారా మారుతి గారి శిష్యుడు శివగణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రేపు (ఏప్రిల్‌ 23న) ఈ చిత్రం ప్రపంచవాప్తంగా రిలీజ్‌ అవుతోంది.
యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, లవ్‌, ఫ్రెండ్‌షిప్‌...
కథ డిమాండ్స్‌ మేరకు ఇందులో ఇద్దరు హీరోలు కావాలి. నాతో పాటు మరో హీరోగా రామ్‌ ఖన్నాని తీసుకున్నారు. యాక్షన్‌, కామెడీతో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. జోష్‌ రవి పాత్ర పూర్తి ఎంటర్‌టైనింగ్‌ని కలుగజేస్తుంది.  హీరోయిన్స్‌ శ్రావ్య, షామిలి తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌ కష్టపడి నటించారు. దర్శకుడు శివగణేష్‌ మా దగ్గర్నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ‘కాయ్‌ రాజా కాయ్‌’ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ కమర్షియల్‌ మూవీ. యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ఇలా ఒక కమర్షియల్‌ మూవీకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.
మా ముగ్గురి లైఫ్‌ని ఛేంజ్‌ చేసిన గేమ్‌...
నాతో పాటు రామ్‌ఖన్నా, జోష్‌ రవి అద్భుతంగా నటించారు. ఇందులో నా పాత్ర పేరు ఆనంద్‌. చాలా రెస్పాన్సిబిలిటీస్‌ వున్న ఒక కుర్రాడి పాత్ర. తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కోసం విలేజ్‌ నుంచి సిటీకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎంబిఎ, ఎంసిఎ చేసినోళ్లకే సిటీలో జాబ్స్‌ దొరకట్లేదు. డిగ్రీ చదివిన నాకు ఎవరు జాబ్‌ ఇస్తారు.. ఇక్కడ జాబ్‌ దొరకటం కష్టమేనని ఆ కుర్రాడికి అర్ధమైపోతుంది. ఎలాగోలా ఎమ్మెల్యే హౌస్‌లో ఒక జాబ్‌ సంపాదించడం, ఆ తర్వాత ఎమ్మెల్యే కుమర్తెను లవ్‌ చేయడం, ఎమ్మెల్యే గ్యాంగ్‌ మా వెంటపడటం లాంటి సన్నివేశాలు వుంటాయి. నార్మల్‌గా వుండే మా ముగ్గురి లైఫ్‌ని ఛేంజ్‌ చేసిన గేమ్‌ కాయ్‌ రాజా కాయ్‌. అది ఎలాగో ఇప్పుడు చెప్పడం కన్నా సినిమా చూస్తేనే బాగుంటుంది.
మంచి నటుడు అనిపించుకోవాలనేది నా కోరిక...
లవర్‌బోయ్‌గా వుంటూనే మాస్‌ ప్రేక్షకులను కూడా మెప్పించాలనుంది. అందుకు చాలా కష్టపడాలి. కానీ కృషి, పట్టుదల వుంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. ఎప్పటికైనా ఇటు క్లాస్‌, అటు మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాను. కథకు ఇంపార్టెన్స్‌ వున్న ఎలాంటి క్యారెక్టర్‌ చేయడానికైనా నేనెప్పుడూ సిద్ధమే. అయితే నేను పోషించే పాత్ర ద్వారా మానస్‌ మంచి నటుడు అనిపించుకోవాలనేది నా కోరిక.
 నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌...
 ప్రస్తుతం హీరోగా రెండు చిత్రాలు ఒప్పుకున్నాను. వీటిలో ఒక ప్రాజెక్ట్‌ పెద్ద బ్యానర్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయ్యింది. సాంగ్స్‌ బ్యాలెన్స్‌ వున్నాయి. ఈ నెలాఖరులో సాంగ్స్‌ని చిత్రీకరించాడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇంకా రెండు మూడు చిత్రాలకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.

Tags: Kai Raja Kai Movie , Kai Raja Kai Movie Hero Manas Exclusive Interview , Actor Manas
« PREV
NEXT »