Latest News

సీక్వెల్‌పై కన్నేసిన గౌతమ్‌మీనన్‌!
by MTW - 0

తమిళ స్టార్‌ అజిత్‌ హీరోగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చి ఘనవిజయం సాదించి అటు కలెక్షన్లనే కాదు... విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘ఎన్నై అరిందాల్‌’. ఈ చిత్రం త్వరలో తెలుగులో ‘ఎంతవాడు గానీ ’ అనే టైటిల్‌తో విడుదలకు సిద్దమవుతోంది. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అజిత్‌ పోలీసాఫీసర్‌గా ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలనే యోచనలో గౌతమ్‌మీనన్‌ ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. ప్రస్తుతం అజిత్‌ చేస్తున్న సినిమాలు పూర్తికాగానే ఈ సీక్వెల్‌ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
« PREV
NEXT »