మధుశాలిని సీతగా బాహుమన్య ఆర్ట్స్ పతాకంపై మాదల వేణు దర్శకత్వంలో తూము
ప్రియాంక నిర్మించిన షార్ట్ ఫిలిం ‘సీతావలోకనం’. ఈ షార్ట్ ఫిలిం ప్రదర్శన
సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బి.జె.పి. అధ్యక్షులు కిషన్‌రెడ్డి,
ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రరారెడ్డి, జయసుధ, రోజారమణి, కొండవీటి
జ్యోతిర్మయి, సత్యవాణి, లగడపాటి జానకి, గోనల నిర్మల, కవిత, నిర్మాత తూము
ప్రియాంక, దర్శకుడు వేణు మాదల, నటి మధుశాలిని, పద్మజారెడ్డి, సన తదితరులు
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘సీతావలోకనం’ పోస్టర్‌ను కిషన్‌రెడ్డి,
రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
కిషన్‌రెడ్డి: సందేశాత్మకమైన ఈ చిత్రాన్ని నిర్మించిన
ప్రియాంకగారు, ఈ కథను రచించి సినిమాగా తీసిన వేణుగారికి అభినందనలు
తెలియజేస్తున్నాను. ఈ సినిమా రామాయణం చూసినవారికి, చదివిన వారికి మాత్రమే
అర్థమవుతుంది. మిగతా వారికి అర్థం కాదు. ఇది రాబోయే తరానికి కూడా చాలా
అవసరం. ఈ చిత్రానికి చాలా మంది పనిచేశారు. కెమెరా, సంగీతం, ఆర్ట్ చాలా
బాగున్నాయి. మధుగారి నటన అద్భుతం. వేణుగారు18 నిముషాల్లో చాలా చక్కగా,
కొత్తగా తీశారు. ఈ సందర్భంగా యూనిట్‌లోని అందర్నీ అభినందిస్తున్నాను.
చింతల రామచంద్రారెడ్డి: సీతావలోకనం పేరుతో చూపించిన ఈ
కథలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వున్న సీతమ్మ రూపు రేఖల్ని ఈరోజు ఈ
సినిమా ద్వారా మనకి చూపించాడు వేణు. చాలా బాగా ఈ సినిమా తీశారు. దానికి
ప్రియాంకను, వేణుని, సీతగా నటించిన మధుశాలినిని అభినందిస్తున్నాను. ఇలాంటి
సినిమాలు ఇంకా రావాలి. సమాజంలో మార్పు రావాలి. ఇంత మంచి ప్రయత్నం చేసిన
వీరికి ఈ సినిమా ద్వారా రెవిన్యూ కూడా రావాలి. అదేమీ ఆలోచించకుండా సమాజం
హితం కోసం ఈ సినిమా తీసినందుకు వారిని మరొక్కసారి అభినందిస్తున్నాను.
జయసుధ: సీత గురించి తెలియని విషయాలు ఎన్నో ఈ ఫిలింలో
చూపించారు. ఎంతో మందికి వున్న డౌట్స్‌ని ఇందులో క్లియర్ చేశారు. సీత
గురించి ఇలా కూడా తియ్యొచ్చు అనే థాట్ డైరెక్టర్‌కి రావడం చాలా గొప్ప
విషయం. ఇంత మంచి సినిమాని తీసిన దర్శకనిర్మాతల్ని అప్రిషియేట్ చెయ్యాలి.
రోజా రమణి: దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వేణు కొన్ని
పేపర్స్ ఇచ్చి చదవమన్నాడు. చదివిన తర్వాత మొదట నాకు అర్థం కాలేదు. మళ్ళీ
మళ్ళీ చదివితే అతను ఎంత లోతుగా సీత పాత్ర గురించి ఆలోచించాడనేది అర్థమైంది.
అప్పుడు అతను రాసుకున్న కథని ఒక షార్ట్ ఫిలిమ్‌గా తీశానని తప్పకుండా
రావాలని ఆహ్వానించాడు. స్క్రీన్ మీద చూసిన తర్వాత నిజంగా చాలా సంతోషం
కలిగింది. సీత వల్లే రాముడికి అంత పేరు వచ్చిందని చెప్పే ఈ షార్ట్ ఫిలిం
తియ్యాలంటే మంచి సంకల్ప బలం వుండాలి. అలాంటి బలం వుంది కాబట్టే వేణు,
ప్రియాంక ఈ చిత్రాన్ని తియ్యగలిగారు. వారు చేసిన ఈ ప్రయత్నాన్ని
అభినందిస్తున్నాను.
తూము ప్రియాంక: మా చిత్రాన్ని చూడడానికి వచ్చిన నా ఫ్రెండ్స్, పెద్దలకు ధన్యవాదాలు. మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు.
మధుశాలిని: మా ప్రయత్నం మేం చేశాం. దీని గురించి
మీరంతా ఎంతో గొప్పగా మాట్లాడడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నన్ను
ఇంతకుముందు గ్లామర్ రోల్స్‌లోనే ఎక్కువగా చూడడం వల్ల మధుశాలిని ఇలాంటి
క్యారెక్టర్సే చెయ్యగలదు అనుకునేవారు. వాటన్నింటినీ బ్రేక్ చెయ్యడానికి
నాకు మంచి అవకాశం వచ్చింది. నేను ఇలా చెయ్యగలుగుతానా అని నాకే నమ్మకం
కలగలేదు. అలాంటి ధైర్యాన్ని నాకిచ్చిన వేణుగారికి థాంక్స్. ఇంత మంచి
సినిమా చెయ్యడానికి ముందుకొచ్చిన ప్రియాంకకి థాంక్స్. అలాగే ఈ సినిమా
చేస్తున్నామని చెప్పగానే నీరజ్‌గారు తమ షాపులోని జ్యూయలరీ ఏది కావాలో అది
తీసుకోమని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
మాదల వేణు: ఈ సినిమా తియ్యడానికి రీజన్ రామారావుగారి
లవకుశ. సీత లేకుండా రాముడు యాగం చేసేటపుడు అంజలీదేవిగారు చాలా బాధపడతారు.
కానీ, ఆమె కంటే నేనే ఎక్కువ బాధపడ్డాను. సీత అంటే లక్ష్మీ స్వరూపం కదా,
ఆవిడకి లేని ఆస్తి ఏమిటి, భూదేవికి ముద్దుల కూతురామె. ఆమెకి లేని అధికారం
ఏమిటి, ఆమెకి లేని తెలివి తేటలు ఏమిటి? అలాంటి ఆమె ఎందుకు ఏడుస్తోంది.
క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ రీజన్. మా సినిమాకి ఒక పెద్ద సినిమాకి ఇచ్చిన
సపోర్ట్ ఇచ్చారు మీడియా. ఎన్ని పనులున్నా అమ్మలంతా నన్ను ఆశీర్వదించడానికి
వచ్చారు. అలాగే కిషన్‌రెడ్డిగారు, రామచంద్రారెడ్డిగారు వచ్చినందుకు
ధన్యవాదాలు.
మధుశాలిని, ప్రగతి, మీనాకుమారి తదితరులు నటించిన ఈ షార్ట్ ఫిలిమ్‌కి
సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: ఎస్.వి.డి.విశ్వేశ్వర్, ఆర్ట్:
రామకృష్ణ, రీ`రికార్డింగ్: లెనినా చౌదరి, ఎడిటింగ్: కళ్యాణ్,
కోడైరెక్టర్: హరినాథ్, అసిస్టెంట్ డైరెక్టర్స్: ధీరజ్రాజు, సుబ్బు,
మేకింగ్ స్టిల్స్: మరురాక్స్, హరినాథ్ చౌదరి, చైతన్య, పోస్టర్
డిజైన్: ధని ఏలే, నిర్మాత: తూము ప్రియాంక, రచన, దర్శకత్వం: మాదల వేణు.
Social Buttons