Latest News

మ‌డివాలమాసుదేవా గా సాయికుమార్
by MTW - 0

సాయికుమార్ , చారుల‌త జంట‌గా నంది కె రెడ్డి ద‌ర్శక‌త్వంలో శ్రీ ష‌ణ్ముఖ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ద్వారం పూడి శంక‌ర్ రెడ్డి శ్రీ‌మ‌తి సుశీల స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొఢ‌క్ష‌న్ నెంబ‌ర్ వ‌న్ గా తెలుగు క‌న్న‌డ భాష‌ల్లో ఓ సినిమా రూపొందుతోంది. క‌ర్నాట‌క ప్రాంతంలో కృష్ణ దేవ‌రాయ కాలంలో రుద్ర‌మ దేవి వ‌ద్ద సైనికుడిగా ప‌ని చేసినవాడు వీర‌భ‌ద్రుడి వంశం వాడైన  మ‌డివాల మాసుదేవా జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది
మ‌డివాల మాసుదేవా అనే వ్య‌క్తి ఆ కాలంలో సాంఘిక దురాచారాల‌ను ఎదిరించి మ‌నిషిగా ఒక స‌మోన్న‌త స్థానానికి ఎదిగారు..ఆ కాలంలో లోనే కుల‌మ‌తాల‌ను వ్య‌తిరేకించి వ‌ర్ణ‌సంగ్రామం చేసిన మ‌హోన్న‌త వ్య‌క్తి..త‌ద‌నంతరం రాజుతో పోరాడి అసువులు బాశాడు. అని ద‌ర్శ‌కుడు తెలిపాడు.ఈ సినిమాషూటింగ్ జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైంది బెంగుళూరు , మైసూరు శ్రీ‌రంగ ప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతుంది.  మే నెల‌లో తెలుగు గు సంబందించిన షూటింగ్ తెలంగాణా ఆంధ్ర రాష్ట్రాల్లో జ‌రుగుతుంది .ఇది సాయి కుమార్ కెరియ‌ర్ లో ఒక పెద్ద చిత్రంగా చ‌రిత్ర‌లో నిల‌చి పోతుంది అన్నారు నిర్మాత ద్వారం పూడి శంకర్ రెడ్డి.
ఈ సినిమాకు సంగీతంః హంస‌లేఖ, కెమెరాః రాంరెడ్డి, ఫైట్స్ః థ్రిల్ల‌ర్ మంజు , స‌మ‌ర్ప‌ణః శ్రీ‌మ‌తి సుశీల, నిర్మాతః ద్వారంపూడి శంక‌ర్ రెడ్డి క‌థ‌, స్ర్కీన్ ప్లే , ద‌ర్శ‌క‌త్వంః నంది  కెరెడ్డి.

« PREV
NEXT »

No comments

Post a Comment