Latest News

జయసుధ ట్రెండ్ సెట్ చేస్తోంది.. వాట్ ఏ ప్లాన్
by MTW - 0

టాలీవుడ్ లో  వారసత్వం ఎప్పుడో కామనైపోయింది. దాదాపు సగానికిపైగా యంగ్ హీరోలు.. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల వారసులే. అయితే  ఇప్పటి వరకు హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల కుమారులే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు..కాని తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్ వారసుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగేస్తున్నాడు.. అతడే నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్.
అవును మీరు విన్నది నిజమే..శ్రేయాన్ కపూర్ హీరోగా  ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.. ఎవరికి తెలియకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. దాదాపు తుది దశకు చేరుకుందని సమాచారం. మరోవైపు శ్రేయాన్ జోడీగా బీటౌన్ బుల్లితెర బ్యూటీ ప్రగతి చౌరస్య అనే ముద్దుగుమ్మ నటిస్తోందని తెలుస్తోంది..వాసు మంతెన అనే వ్యక్తి ఈ మూవీకి దర్శక,నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని టాక్.
సాధారణంగా స్టార్ల వారసుల సినిమా ఎంట్రీ అంటే.. చాలా హడావిడి చేస్తారు.. కాని జయసుధ మాత్రం తన కుమారుడిని ఇలా సైలెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణమెంటో అని అంతా అనుకుంటున్నారు. వారి స్ట్రాటజీ ఏదైతేనేం గాని.. శ్రేయాస్ తల్లికి తగ్గ అనిపించుకుంటాడా లేదా చూడాలి మరి.
« PREV
NEXT »