తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది
లగాయతు తాప్సీ కొన్నాళ్ల పాటు యమ బిజీ అయిపోయింది. ఇక స్టార్ హీరోయిన్ల
సరసన చేరిపోవడమే లేటు అనుకునేంతలో ఆమెకి వరుస ఫ్లాపులు తగిలాయి. దాంతో
తాప్సీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఐరెన్లెగ్ అనే ముద్ర పడిపోవడంతో
అదృష్టాన్ని వెతుక్కుంటూ ముంబై వెళ్లిపోయింది. కానీ తిరిగి తెలుగునాట బిజీ
కావాలని తాప్సీ కలలు కంటోంది. ఆమె చేతిలో ఇప్పుడున్న ఏకైక చిత్రం లారెన్స్
డైరెక్ట్ చేసిన 'గంగ'. ఇందులో లారెన్స్ సరసన నటించిన తాప్సీ 'కాంచన'లానే
ఇది కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని అనుకుంటోంది.
ఇది హిట్టయితే తనకి మళ్లీ ఇక్కడ అవకాశాలు
పెరుగుతాయని ఆశపడుతోంది. లారెన్స్ మీద అపారమైన నమ్మకంతో ఈ చిత్రం కోసం
చాలా రోజుల కాల్షీట్లు ఇచ్చేసింది. ఎక్కువ కాల్షీట్లు ఇచ్చినందుకు అదనరగా
పారితోషికం కూడా తీసుకోలేదట. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ చిత్రంతో ఒకేసారి
డబుల్ జాక్పాట్ కొట్టవచ్చని ఎదురు చూస్తోంది. గంగపై ప్రీ రిలీజ్ బజ్
కూడా బాగానే ఉంది. ఈ జానర్లో ఫెయిల్యూర్స్ తక్కువ కనుక తాప్సీ కలలు
నిజమయ్యే అవకాశాలున్నాయి. కాకపోతే ఇది హిట్ అయినా కానీ తనని ఎంత మంది
పట్టించుకుంటారనేదే కీలకం.
No comments
Post a Comment