అదృష్టం
ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి సీరియల్స్
లో నటించే ముద్దుగుమ్మలకు కూడా బంపర్ ఆఫర్స్ వస్తుంటాయి. ఇప్పుడు
టాలీవుడ్ లో ఇలాంటి సీరియల్ భామలకే టైమ్ నడుస్తోంది. బాలీవుడ్
సీరియల్స్ లో నటిస్తోన్న ముద్దుగుమ్మలను తీసుకొచ్చి ఇక్కడ హీరోయిన్లు
చేస్తున్నారు దర్శకులు. జాదూగాడులో సెక్సీలుక్స్ తో కవ్విస్తోన్న
సోనారిక.. ఉత్తరాదిన హరహర మహదేవ అనే సీరియల్ తో బాగా పాపులర్.
అందులో పార్వతిగా నటించింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏ మాత్రం
అడ్డుచెప్పని సోనారిక.. జాదూగాడు హిట్ అయితే ఇక్కడే సెటిలైపోవడం ఖాయం.
పూరీ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న ఆంధ్రాపోరితో
ఉల్కాగుప్తా అనే అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పాపులర్ హిందీ
సీరియల్ ఝాన్సీ రాణిలో టైటిల్ రోల్ చేసింది ఉల్కా. ఇంకా స్కూల్ ఏజ్ లోనే
ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆంధ్రాపోరితో హీరోయిన్ గా మారింది. ఇక అవికాగోర్
కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిందే సీరియల్స్. చిన్నారి పెళ్లికూతురులో
ఆనందిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ భామ.. తెలుగులో ఉయ్యాలా జంపాలతో
హీరోయిన్ అయిపోయింది. ఇలా హిందీ సీరియల్స్ లో నటిస్తోన్న భామల్నే
మనోళ్లు హీరోయిన్లుగా మార్చేస్తున్నారు.
Social Buttons