Latest News

బుడుగు మూవీ రివ్యూ
by MTW - 0


మూవీ : బుడుగు మూవీ రివ్యూ

విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2015

రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : మన్మోహన్

నిర్మాత : భాస్కర్, శ్రీనివాస్ సారిక

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : మంచు లక్ష్మి, శ్రీధర్ రావు, మాష్టర్ ప్రేం ప్రభు , తదితరులు


డా. మోహన్ బాబు ముద్దుల తనయురాలు మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుడుగు’. మాస్టర్ ప్రేమ్ బాబు కీ రోల్ చేసిన ఈ సినిమా ద్వారా మన్మోహన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఒక కురుంబ నేపధ్యలో జరిగే ఇబ్బందుల వల్ల పిల్లల మానసిక పరిస్థితులు ఎలా మారతాయి అనే పాయింట్ ఈ సినిమాలో చూపించారు. భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఏ మేరకు థ్రిల్ చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఉండాల్సిన వయసు కన్నా తక్కువ మానసిక ఎదుగుదల ఉన్న 10 ఏళ్ళ కుర్రాడి మనోవేదనే ఈ ‘బుడుగు’. ఇక కథలోకి వెళితే.. పూజ(లక్ష్మీ మంచు) – రాహుల్(శ్రీధర్ రావు) దంపతులకు ఇద్దరు పిల్లలు., వాళ్ళే బన్ని(మాస్టర్ ప్రేమ్ బాబు) మరియు విద్య (బేబీ డాలీ). రాహుల్ తన జాబు వల్ల పిల్లలతో సరిగా స్పెండ్ చెయ్యడు. ఈ గ్యాప్ వల్ల బన్ని సరిగా ఉండడం లేదని, అల్లరి ఎక్కువైందని రాహుల్ తనని తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు. కానీ అక్కడ బన్ని చేసిన కొన్ని సంఘటనల వలన స్కూల్ లో వాళ్ళందరూ భయపడి తనని అక్కడి నుంచి పంపేస్తారు

అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాక బన్ని చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటాడు. అర్ధ రాత్రిళ్ళు దెయ్యం వస్తోందని, అలాగే చనిపోయిన దియా తనకు కనపడుతోందని భయపడుతుంటాడు. ఒక రోజు పూజ కూడా ఇంట్లో ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి రావడంతో తెగ భయపడిపోతుంది. దాంతో పూజ బన్నిని చిల్డ్రన్స్ సైకాలజిస్ట్ గీత రెడ్డి(ఇంద్రజ) దగ్గరికి తీసుకెళ్తారు. ఆమె ఓ కౌన్సిలింగ్ చేసి ఓ సమస్యని చెబుతుంది. ఆ సమస్య వల్లే బన్ని అలా అయ్యాడని చెబుతుంది. అసలు బన్నికి ఉన్న సమస్య ఏమిటి.? అసలు తనెందుకు అలా బిహేవ్ చేస్తుంటాడు.? దియానే ఎందుకు బన్నికి కనపడుతుంది.? అసలు దియా ఎవరు.? బన్నికి దియాకి ఉన్న రిలేషన్ ఏంటి.? చివరికి బన్ని ఏమయ్యాడు.? అన్నది తెలియాలంటే బుడుగు చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘బుడుగు’ సినిమాలో నేటితరం తల్లి తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఒకవేళ పిల్లలతో సరిగా లేకపోతే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు అనే పాయింట్ ని ఈ సినిమాలో బాగా చెప్పాడు. ఈ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ నటీనటుల ఎంపిక.. సినిమాలో ప్రతి పాత్రలోనూ తీసుకున్న నటీనటులు బాగా ఇమిడిపోయారు.

లక్ష్మీ మంచు ఇందులో ఓ భాద్యతాయుతమైన భార్య మరియు పిల్లలను ప్రేమించే తల్లి పాత్రలో కనిపించింది. మదర్ గా చక్కని హావ భావాలు పలికించి నటనలో మరో మెట్టు పైకి ఎక్కింది. ఇప్పటి వరకూ హర్రర్ సీన్స్ చెయ్యని లక్ష్మీ మంచు ఈ సినిమాలో సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్ లో చాలా బాగా చేసింది. ఇక మాస్టర్ ప్రేమ్ బాబు సైకలాజికల్ గా వచ్చే ఇబ్బందులను చూపించే పిల్లాడి పాత్రలో ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. బేబీ డాలీ చూడటానికి క్యూట్ గా ఉండటమే కాకుండా మూగ పాత్రలో చాలా బాగా చేసింది. శ్రీధర్ రావు తన పాత్రకి న్యాయం చేసాడు. ఇంద్రజ డాక్టర్ పాత్రలో సినిమాలో చాలా కీ రోల్ చేసింది. ఈ పాత్రే సినిమాని ఓ మలుపు తిప్పుతుంది.

ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సినిమా మొదలైన 10 నిమిషాలు చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కాస్త ఆడియన్స్ లో సస్పెన్స్ ని రేకెత్తిస్తుంది. ఆ ఊపుతో సాగే సెకండాఫ్ ఆసక్తికరంగా మొదలవుతుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా లక్ష్మీ మంచు – ప్రేమ్ బాబు – శ్రీధర్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలకేపోవడం. డైరెక్టర్ అనుకున్న పాయింట్ మరియు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ బాగున్నా తీయడంలో, ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ మరో మేజర్ డ్రా బ్యాక్. ఫస్ట్ హాఫ్ లో మొదటి 5 నిమిషాలు, ఇంటర్వెల్ బ్లాక్ 5 నిమిషాలు తీసేస్తే మిగతా 50 నిమిషాలు చాలా బోరింగ్ గా సాగుతుంది. ఈ 50 నిమిషాలు జస్ట్ కాన్సెప్ట్ ని డెవలప్ చెయ్యడానికే తీసుకున్నాడు. చూసే వారికి అంత సాగదీయడం ఎందుకు అనే భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా థ్రిల్లింగ్ మోమెంట్స్ ఏమీ లేవు.
« PREV
NEXT »

No comments

Post a Comment