Latest News

దాగుడు మూత దండాకోర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
by MTW - 0

క్రిష్ సమర్పణలో, ఉషాకిరణ్ మూవీస్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం దాగుడుమూత దండాకోర్. మే తొమ్మిదిన ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. తాత, మనుమరాలు, ఓ కోడిపుంజు మధ్య జరిగే సున్నితమైన కథాంశానికి ఫ్యామిలి ఎమోషన్స్ ని జోడించిన చిత్రం ఇది. ఏమాత్రం అశ్లీలత లేని చక్కగా రెండు గంటలు నవ్వుకునే చిత్ర ఇది. ఫ్యామిలి ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. తాత పాత్రలో రాజేంద్రప్రసాద్, ఆయన మనుమరాలిగా సారా అర్జున్ (నాన్న ఫేమ్) నాని పాత్రలో ఓ కోడిపుంజు కనువిందు చేస్తారు. వీళ్లతో పాటు యువ జంటగా సిద్ధు, నిత్యాశెట్టి నటించగా ఫ్యామిలి మెంబర్స్ గా రవి ప్రకాష్, ప్రభు, శ్రీ హర్ష, సంధ్యా జనక్, బాలు నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో సత్యం రాజేష్, రోలర్ రఘు, జబర్దస్త్ శ్రీను హాస్యాన్ని జోడించారు. వి.యస్.మూర్తి సంగీతమందించారు.« PREV
NEXT »