ప్రిన్సెస్
కాజల్ అగర్వాల్ కి టాలీవుడ్ లో టైం బాలేదు. తెలుగులో కావాల్సినన్ని
హిట్లు ఖాతాలో ఉన్నా.. అదేంటో ఈ ముద్దుగుమ్మని ఇప్పుడు పెద్దగా ఎవరూ
పట్టించుకోవడం లేదు. దీంతో టెంపర్ మూవీ తర్వాత కాజల్ మరో ఆఫర్ రాలేదు.
టాలీవుడ్ లో అనావృష్టిని ఎదుర్కొంటున్న అమ్మడికి కోలీవుడ్ లో మాత్రం
అదృష్టం బాగున్నట్టుంది. ఇప్పడక్కడ కాజల్ కు ఒకదానివెంట ఒకటి మూవీలు
క్యూకడుతున్నాయి.
ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ చిన్నది
ఏకంగా మూడు సినిమాలు చేస్తోంది. ఇందులో ఒక మూవీ హీరో ధనుష్ తో చేస్తుండగా
,మరొకటి విశాల్ మూవీ.. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.. ఇవిలా
ఉండగానే కాజల్ మరో బంపర్ ఆఫర్ తగిలింది. తాజాగా చియాన్ విక్రమ్ తో కలసి
నటించే చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ చాన్స్ కొట్టేసింది. త్వరలో ఈ మూవీ సెట్స్
పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
సో టాలీవుడ్ లో టైం బాగాలేకపోయినా.. కోలీవుడ్ బాగానే ఆదుకుంటోంది కాజల్ ని... మరి వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో..!
Tags: Kajal Aggarwal busy with Tamil Movies , Kajal Aggarwal , Actress Kajal
సో టాలీవుడ్ లో టైం బాగాలేకపోయినా.. కోలీవుడ్ బాగానే ఆదుకుంటోంది కాజల్ ని... మరి వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో..!
Tags: Kajal Aggarwal busy with Tamil Movies , Kajal Aggarwal , Actress Kajal
Social Buttons