బాలీవుడ్
లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ. కండలవీరుడు జైలుకెళ్తాడా లేదంటే
నిర్దోషిగా బయటపడతాడా..? 13 ఏళ్ల క్రితం తాగి కార్ నడిపి ఒకరి
మరణానికి కారణమయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ హిట్ అండ్ రన్ కేసు ఇన్నేళ్ల
నుంచి కోర్ట్ లో నానుతూనే ఉంది. ఈ కేసుపై ఇప్పటికే ఎన్నో వాదనలు
పూర్తయ్యాయి. ఈ మధ్యే కోర్టుకు హాజరైన సల్మాన్.. యాక్సిడెంట్
జరిగినపుడు తాను కారు నడపలేదని డ్రైవర్ నడిపాడని కోర్టుకు
విన్నవించుకున్నాడు. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణలు అన్ని తాజాగా
పూర్తయ్యాయి. తుదితీర్పును మే 6న వెల్లడించడానికి కోర్ట్ సిద్ధమైంది.
అయితే ఇక్కడే అందరికీ టెన్షన్ పెరిగిపోతుంది. సల్మాన్ ఈ కేసు నుంచి
బయటపడతాడా లేదంటే జైలుకెళ్తాడా అని.
సల్మాన్
నిర్దోషిగా బయటపడితే అంతా మంచిదే. అలా కాదని ఒకవేళ నేరం రుజువై
జైలుకెళ్లాడా.. అంతే సంగతులు. 2017 వరకు సల్మాన్ డైరీ ఫుల్. నేరం
రుజువైతే సల్మాన్ కు దాదాపు పదేళ్ల శిక్ష పడటం ఖాయంగా కనిపిస్తుంది.
ఇదే జరిగితే సల్మాన్ పై నిర్మాతలు పెట్టిన దాదాపు 300 కోట్ల పెట్టుబడి
బూడిదలో పోసిన పన్నీరౌతుంది. ఇప్పటికే సంజయ్ దత్ జైలుకెళ్లడంతో
దాదాపు 150 కోట్ల వరకు నష్టపోయారు నిర్మాతలు. ఇప్పుడు సల్మాన్ లాంటి
టాప్ హీరో జైలుకెళ్తే అతడితో సినిమాలు చేసే నిర్మాతలు రోడ్డున పడటం
ఖాయం. మరి ఇలాంటి సమయంలో సల్మాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మే 6న
తేలనుంది.
Social Buttons