Latest News

హ్యాట్రిక్‌కు సిద్దమవుతోన్న మిల్కీబ్యూటీ!
by MTW - 0

హీరో నాగచైతన్య సరసన తమన్నా ఇప్పటికే రెండు సార్లు జోడీ కట్టింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీంతో చైతూకు కూడా తమన్నా సెంటిమెంట్‌ ఏర్పడింది . తమన్నా కాస్త పెద్ద హీరోల సరసన నటించిన చిత్రాల్లో రామ్‌చరణ్‌ సరసన నటించిన ‘రచ్చ’ తప్ప ఇంకేమీ పెద్ద హిట్లు లేవు. అలా చూసుకుంటే నాగచైతన్యతో తమన్నా జోడీ సూపర్‌హిట్టు అనే చెప్పాలి. కాగా త్వరలో చైతూ ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మొదట చైతూ సరసన సమంతను పెట్టుకోవాలని దర్శకుడు భావించినప్పటికీ చైతూ సూచన మేరకు తమన్నాను తీసుకోనున్నట్లు సమాచారం. సో.. ‘100%లవ్‌, తడాఖా’ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ హాట్రిక్‌కు రెడీ అవుతున్నారు.
 




« PREV
NEXT »