అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ హీరోగా
నిలదొక్కుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. కొత్త జంటతో హీరోగా
ఇంప్రెషన్ వేయలేకపోయినా కానీ నిర్మాతలకి పెట్టిన డబ్బులని వెనక్కి తీసుకు
రాగలిగాడు. తన మొదటి రెండు చిత్రాలకి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి తన
ఫిజిక్ పరంగా మార్పులు చేసుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్
చేసినట్టు న్యూస్. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ తదుపరి చిత్రం
తెరక్కెనుంది. ఇందులో అతని సరసన అందాల భామ త్రిధ చౌదరి హీరోయిన్గా
నటిస్తుంది.
సూర్య వర్సెస్ సూర్యతో ఇంప్రెస్ చేసిన
త్రిధ ఈ చిత్రంలో నటించేందుకు ఎక్కువ పారితోషికమే అడిగిందట. తన సినిమాల్లో
హీరోయిన్లు మాత్రం ఖచ్చితంగా అందగత్తెలు, ఆల్రెడీ ఇంప్రెస్ చేసిన వాళ్లే
ఉండాలని శిరీష్ కోరుకుంటున్నాడు. మొదటి సినిమాలో యామీ గౌతమ్, తర్వాత
రెజీనా.. ఇప్పుడు త్రిధ, ఇలా హీరోయిన్ల పరంగా శిరీష్ కేర్
తీసుకుంటున్నాడు. హీరోయిన్ ఇంప్రెసివ్‌గా ఉంటే బాక్సాఫీస్ పరంగా
అడ్వాంటేజ్ ఉంటుందనేది శిరీష్ లెక్కలా ఉంది. ఎంతైనా మొదట్లో నిర్మాణ
వ్యవహారాలు చూసుకున్నాడు కదా... ఆమాత్రం కిటుకులు తెలిసే ఉండాలి.
No comments
Post a Comment