Latest News

నేపాల్ దుర్ఘటనలో ఎటకారం చిత్ర నృత్య దర్శకుడు విజయ్ మృతి
by MTW - 0

తెలుగు చిత్ర పరిశ్రమ మరో సాంకేతిక నిపుణుడిని కోల్పోయింది. నృత్య దర్శకుడిగా, నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విజయ్(25) నేపాల్ భూకంపం దుర్ఘటనలో మృతి చెందారు. ఎటకారం.కామ్ అనే చిత్ర పాటల చిత్రీకరణ కోసం ఇరవై మందితో కూడిన యూనిట్ సభ్యులు నేపాల్ వెళ్లారు. ఇటీవల సంభవించిన భూకంపం విజయ్ ప్రాణాల్ని తీసుకుంది. విజయ్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో... పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం అందుతోంది.
విజయ్ స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. విజయ్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యపూజ కంబైన్స్ పతాకంపై కిషన్ కవాడియా నిర్మాతగా వీరేందర్ రెడ్డి దర్శకత్వంలో దినేష్ హీరోగా ఎటకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్... నిర్మాత కిషన్ కవాడియాకు అన్న కుమారుడు. 
అంతా క్షేమంగా ఉన్నారనుకున్న సమయంలో విజయ్ మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.




« PREV
NEXT »