అదేంటో
గానీ.. కొందరు ఏం మాట్లాడినా సెటైర్లు వేసినట్లే ఉంటుంది. ఇలాంటి
వాళ్లలో రామ్ గోపాల్ వర్మ అందరికంటే ముందుంటాడు. తాజాగా తన ట్విట్టర్
లో మరోసారి రెచ్చిపోయాడు వర్మ. ఈ సారి వర్మగారి టాలెంట్ కు బలైన హీరో
మమ్ముట్టి. ఈ మలయాళ సూపర్ స్టార్ ను చాలా చిత్రమైన కమెంట్స్ పోస్ట్
చేసాడు వర్మ. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ నటించిన ఓకే బంగారం
చూసిన రామూ.. ట్విట్టర్ లో తన పెన్ను ప్రతాపం చూపించాడు. ఓకే బంగారం
చూసిన తర్వాత.. అవార్డ్ సభ్యులకు ఏ మాత్రం తెలివి ఉన్నా మమ్ముట్టి
అవార్డులన్నీ తీసి దుల్కర్ కి ఇచ్చేయాలని ఓ ట్వీటేసాడు వర్మ. అంతటితో
ఆగలేదు.. దుల్కర్ సల్మాన్ ను చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలట..
అక్కడితో వర్మగారి పైత్యం అంతం కాలేదు.
దుల్కర్ సల్మాన్ ముందు
మమ్ముట్టి జూనియర్ ఆర్టిస్టు అంటూ తేల్చేసాడు. దుల్కర్ కేరళ
గర్వించేలా చేస్తాడని.. ఇతర ఇండస్ట్రీల్లో జెండా పాతేస్తాడని చెప్పాడు
ఈ దర్శకుడు. ఈ కమెంట్స్ చూసిన వాళ్లు మాత్రం వర్మ తెలివిని
మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కర్ర విరగకూడదు.. పాము చావకూడదు
అన్నట్లు ఓ వైపు దుల్కర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మమ్ముట్టికి
పత్రోత్సాహం ఇచ్చాడు. అదే టైమ్ లో మమ్ముట్టిని కావాల్సినంత పాతాళానికి
దించేసాడు. ఎంతైనా వర్మ వర్మే మరి.
Tags: Ram Gopal Varma Controversial comments on Dulquer Salman and Mammootty , Ram Gopal Varma , Dulquer Salman , OK Bangaram
Social Buttons